- అడ్డుకున్న పోలీసులు
- తంగళ్లపల్లి (మం) జిల్లెల గ్రామ శివారులో అఘోరా హల్చల్
- రాజన్న ఆలయంలోని దర్గాను కూలగొడతానని అఘోరి ఛాలెంజ్
- నాగ సాధు అఘోరాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
- టోయింగ్ వ్యాన్‌తో అఘోరి కారును బంధించి హైదరాబాద్ కు తరలింపు
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కొక్కుల వంశీ ) : మత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన అఘోరి ఈ నెల 3న వేములవాడలోని దర్గాను కూల్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో ముందుగానే అప్రమత్తమైన జిల్లా పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సిరిసిల్ల జిల్లా మొత్తం కట్టు దిట్టమైన ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం అఘోరి జిల్లాలోకి ప్రవేశించగానే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, సదరు అఘోరిని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి రావడంతో.. పరిస్థితులు ఉద్రిక్తతగా మారింది. తంగళ్ళపల్లి, సిరిసిల్ల పోలీసులు జిల్లేలకు చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే, పోలీసులు అఘోరితో మాట్లాడడానికి ప్రయత్నించిన అతడు మాత్రం ఒప్పుకోక పోవడంతో చివరికి చేసేదేమీ లేక టోయింగ్ వ్యాన్‌తో కారును బంధించి హైదరాబాద్ మార్గంలో అఘోరీ కారును పోలీసులు తరలించారు.





