నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం ఆలూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సి గ్రేడ్ విద్యార్థులకు శనివారం ఎఐ టెక్నాలజీ ద్వారవిద్యాభోదనను ప్రారంభించారు. సిగ్రేడ్ వచ్చిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరుచుటకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యాబోధన ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెక్కొండ రామ రెడ్డి, విద్యాభివృద్ధి కమిటీ ఛైర్మన్ చిలుక సంజీవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అక్కినపెల్లి సతీష్, ఉపాద్యాయులు సాయి కృష్ణ, రమేష్ రెడ్డి, శృతి పాల్గొన్నారు.





