నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ AISF మండల సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసిరెడ్డి మణికంఠ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ నిరంతరం విద్యార్థి సమస్యల పైన ఉద్యమించే ఉద్యమ నాయకులుగా తన కష్టమే ఫలితంగా కమ్యూనిజం నమ్ముకొని ఉత్తమ లక్షణాన్ని పెంపొందించుకొని ఒక సామాన్య ఏఐఎస్ఎఫ్ కార్యకర్త నుండి రాష్ట్ర అధ్యక్షులు స్థాయికి ఎదిగారని అందరితో సోదర భావంతో కలిసిమెలిసిపోతూ చిరునవ్వుతో పలకరిస్తూ ఎలాంటి కల్మషం లేకుండా తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన వంతు సమాజంలో ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన సంకల్పాన్ని నిర్ణయించుకున్న వ్యక్తి ఈ సమాజానికి అవసరమయ్యే యువశక్తి మా అభిమాన నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ అయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీరు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు దోమ్మాటి వేణుగోపాల్, మండల సహాయ కార్యదర్శి రాంపేల్లి రోహిత్, మండల నాయకులు వీరన్న, శ్రీకాంత్, అనుదీప్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

