Saturday, March 21, 2026

గుర్తింపు సంఘం బాధ్యత గా వ్యవహరిస్తున్న ఏ.ఐ.టీయూ.సీ

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : విధులు నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి నాయకులు కృషి చేస్తున్నారు. ప్రీ మస్టర్లు ఎవరు తీసుకోవడం లేదు ఏఐటియుసి పై అనవసరపు ఆరోపణలు హెచ్.ఎం.ఎస్ మానుకోవాలి. సింగరేణి లో గుర్తింపు సంఘం గా గెలిచిన తరువాత ఏఐటియుసి బాధ్యత గా వ్వవహరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, సింగరేణి లో ప్రీ మస్టర్లు ఎవరు తీసుకోవడం లేదని, ఏ.ఐ.టియు.సి నాయకులు అందరు విధులు నిర్వహిస్తూ గనులపై కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, ఏఐటియుసి పై హెచ్ ఎం ఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న అనవసరపు ఆరోపణలను ఖండిస్తున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు పేర్కొన్నారు. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ… సింగరేణి లో ఎన్నికలు రాకముందు నుంచే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని, నేడు కార్మిక వర్గం అనేక హక్కులు పోరాటం వల్లనేనని, సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు ఏ.ఐ.టియు.సి నాలుగు సార్లు గుర్తింపు సంఘం గా గెలిచిందని పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలో ఏ.ఐ.టియు.సి యూనియన్ కార్మిక వర్గ సంక్షేమం కోసం హక్కుల కోసం ఉద్యమాలు చేయడం జరుగుతుందని వారు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణి లో నూతన గనులు రావడం లేదని, సంస్థ రక్షణ కోసం, అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం హక్కుల సాధన కోసం ఏ.ఐ.టియు.సి నిరంతరం కృషి చేస్తుంటె ఓర్వలేక ఏ.ఐ.టియు.సి నాయకులు ప్రీ మస్టర్లు పడి పోతున్నారని, గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని హెచ్ ఎం ఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న విమర్శలు సహేతుకంగా లేవని పేర్కొన్నారు. ఏ.ఐ.టియు.సి పై ఆరోపణలు, విమర్శలు చేస్తే సింగరేణి లో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. ఏ.ఐ.టియు.సి పై చౌకబారు మాటలు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇంకా సమావేశంలో ఏ.ఐ.టియు.సి నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, చెప్యాల మహేందర్ రావు, వొడ్నాల మల్లయ్య, గాండ్ల కుమార్, సిరిసిల్ల మల్లేష్, జెరిపోతుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News