Wednesday, March 11, 2026

ఏఐటియుసి యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

నేటి సాక్షి, మందమర్రి: సింగరేణి ఏరియాలోని కాసీపేట 2గని పై శనివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఉపాధ్యక్షుడు బియ్యాల వెంకటస్వామి లు ఆవిష్కరించారు. శనివారం వారు గనిని సందర్శించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు అల్పాహారం సేవించే క్యాంటీన్ ను పరిశీలించారు. అనంతరం గని మేనేజర్ జి లక్ష్మి నారాయణ తో సమావేశమై, కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్పత్తిలో రక్షణకు ప్రధానమైన బూట్లు, హ్యాండ్ గ్లౌజులు, డబుల్ స్టాప్ రేకులు రావడం లేదని, గని బ్యాంక్ హెడ్ పైన ట్రాక్ మరమ్మత్తులు, స్కావెంజర్, రెస్ట్ హౌస్, ఫ్యాన్ హౌస్ తదితర పలు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గని పిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్, నాయకులు బొద్దుల వెంకటేష్, కొండపల్లి నర్సయ్య, సుభాష్ చంద్రబోస్, కేతన్, జాహిద్, దేవులపల్లి, అంజాద్ ఖాన్, లింగమూర్తి, వేణుగోపాల్, సాగర్, రమేష్, అశోక్, గంప శ్రీనివాస్, రత్నం నవీన్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News