.నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా అయిజ పట్టణం భరత్ నగర్ కాలనీ లో అనుమానాస్పదంగా (2)గుడిసెలకు నిప్పు అంటుకుని గుడిసెలు పూర్తిగా కాలి బూడిద అవ్వడంతో అక్కడ ఉంటున్నవాళ్ళు కట్టుబట్టలతో బయట పడిన సంగతి తెలుసుకొని వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…, వీరు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడ అయిజ శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు గాజులు అమ్ముకునేందుకు ఇక్కడకు వచ్చి ఇక్కడే గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. రాత్రికి రాత్రే గుడిసెలకు నిప్పంటుకోవడంతో గాజులు, బట్టలు, డబ్బులు, అన్ని కాలి బూడిద అవ్వడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉండటంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సురేష్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ శెక్షావలి ఆచార, ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమారులు అక్కడకు చేరుకొని వారిని పరామర్శించి 5 వేల రూపాయల నగదు, ఒక బస్తా బియ్యం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, రఘు గౌడ్, అశ్వ మారెప్ప, తదితరులు పాల్గొన్నారు.





