నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి ఉత్సవాల ఇన్చార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వర్ధంతి వేడుకలకు ఆకినపల్లి శిరీష హాజరయ్యారు. మహిళల విద్యాభివృద్ధికై నిరంతరం పాటుపడుతూ తమ జీవితాలను త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలో నివాళులు అర్పిస్తూ ఈతరం మహిళలంతా సావిత్రి బాయ్ ని ఆదర్శంగా తీసుకొని ప్రగతి పథంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజన ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.



