Thursday, April 2, 2026

హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆలేటి సుశీల నియామకం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పట్టణానికి చెందిన ఆలేటి సుశీలను నియమిస్తూ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగలి రావు ఆదేశాల మేరకు హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆలేటి సుశీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. మహిలా కాంగ్రెస్ సంస్థను మరింత బలోపేతం చేయడానికి మరియు దానిని మరింత ఉత్సాహంగా చేయడానికి మీరు మీ శాయశక్తులా కృషి చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని వారు ఉత్తరువులో పేర్కొన్నారు. కాగా ఆలేటి సుశీల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోగా సుశీల కు ప్రణవ్ అభినందనలు తెలిపారు. కాగా తన నియామకానికి సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్, జిల్లా అధ్యక్షురాలుకు, రాష్ట్ర అధ్యక్షురాలికి, జిల్లా మంత్రులకు, సుశీల కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News