నేటి, సాక్షి, కరీంనగర్: ఎస్జీఎఫ్రాష్ట్రస్థాయి ఫుట్బాల్పోటీలకు కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికైనట్లు అల్ఫోర్స్విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్–17 బాలుర విభాగంలో పాఠశాలకు చెందిన ఎస్అశ్వత్, ఖాజా మోహినుద్దీన్ అహ్మద్, కే రిషి, అండర్–17 బాలికల విభాగంలో సహస్ర, అనన్య ప్రతిభ కనబర్చి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు విద్యతో పాటు వివిధ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వారికి కావాల్సిన వనరులను కల్పించడంతో ఉజ్వలమైన భవిష్యతు పునాది వేసిన వారవుతారని చెప్పారు. పలు రకాల క్రీడలను నిర్వహించడమే కాకుండా, వాటిని సరైన రీతిలో విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే వివిధ క్రీడల పోటీల గురించి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.

