- బీసీ అజాది స్టూడెంట్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ హై స్కూల్ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 2023-24 విద్యా సంవత్సరం ముగియకముందే 2025-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆల్ఫోర్స్ జీనియస్ హై స్కూల్ పాఠశాల మీద చర్యలు తీసుకొని పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ గారికి పిర్యాదు చేయడం జరిగింది. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన హోర్దింగ్ మరియు ఫ్లెక్స్ బోర్డ్స్ వెంటనే తొలిగించి చర్యలు తీసుకోవాలి అని పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, అభిషేక్, అజయ్, సాయి గణేష్ తదితరులు పాల్కొన్నారు.

