- చింతమాకుల పుణ్యమూర్తి
నేటి సాక్షి తిరుపతి న్యూస్, తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : ఈరోజు బహుజన ప్రజా ఉద్యమంలో భాగంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో దళిత వర్గాలకు సంబంధించి పదోన్నతులు యందు మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన శ్రీ కె .లక్ష్మీదేవి గారి కి అన్యాయం జరిగిందని. ఆమెకు రావలసిన ప్రమోషన్ ని సకాలంలో ఇవ్వకుండా సంబంధం లేని కారణాలు చూపిస్తూ జాప్యం చేయడానికి అఖిలభారత అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి మరియు దళిత సంఘ నాయకులు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ చరణ్ తేజ రెడ్డి గారిని ప్రశ్నించడమైనది. వారు వెంటనే కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి న్యాయం చేస్తానని తెలియజేశారు. అలా జరగని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పాల్గొన్నవారు. కాయం వెంకటరత్నం ,కే రాధాకృష్ణ, చింతమాకుల రెడ్డప్ప, కాకి వెంకటేష్, సుధాకర్ టీచర్ , కరకంబాడి మధు ,రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.




