Friday, March 13, 2026

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

  • జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న సుమారు 17541 ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన పి.ఆర్.సి 7 నెలల ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలో అవుతున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని వెంటనే పరిష్కరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు సమయానికి అందక పోయినా ప్రజాసేవలో ముందుగా నిలిచి సేవలు అందిస్తున్నామని మరి అలాంటి ఉద్యోగులందరికీ కనీస వేతనాలు కొత్త జీవో ను విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఉద్యోగులందరూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ అయినా వారిని రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News