నేటిసాక్షి, రాయికల్ (సింగిడి కార్తీక్) : ఈ నెల 16న జగిత్యాల లోని వివేకానంద మినీ స్టేడియం లో జరిగిన జిల్లా కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డి ఎంపిక పోటీలలో అల్లీ పూర్ విద్యార్థి రిశ్వంత్ అత్యంత ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిశ్వంత్ ఈ నెల20వ తేదీ నుండి 23వ తేదీ వరకు వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన విద్యార్థిని ఎ. ఎ. పి. సి.ఛైర్మెన్ అంజలి,ఉపాధ్యాయులు అభినందించారు.





