- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి సుదూర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో రాజన్న దర్శించుకోవడానికి భక్తులు వస్తారు కావున భక్తుల సౌకర్యార్థం నూతనంగా వేములవాడ డిపోకు బస్సులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.. సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల డిపో నుండి నిత్యం వచ్చే బస్సులతో పాటు అదనంగా నూతనంగా బస్సుల సంఖ్యను పెంచాలని, కోరుట్ల నుండి వేములవాడ పట్టణానికి చివరి బస్సు సమయం,హైదారాబాద్ నుండి వచ్చే బస్సు సమయం కూడా పెంచాలని కోరారు.. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను, శివరాత్రి రద్దీ సమయంలో బస్సుల సంఖ్యను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు.. అలాగే కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలను కలుపుతూ బస్సుల ఇంటర్ లింకు ప్రక్రియ చేపడతామని తెలిపారు.