Thursday, March 26, 2026

ఆలయాల అభివృద్దికి అధిక నిధుల కెటాయింపు

  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్

నేటిసాక్షి, రాయికల్ : జగిత్యాల నియోజకవర్గం లోని చాల గ్రామాల్లో ఆలయాల అభివృదికి అత్యధిక నిదులు కేటాయించడం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. రాయికల్ మండలం కట్కాపూర్, భూపతిపూర్ గ్రామాల్లోని.గొల్ల కేతమ్మ, శ్రీ లక్ష్మినర్సింహస్వామి ఆలయాలను మంగళవారం సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఆలయాల అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని చాల ఆలయాలకు నిధులను మంజూరు చేయించినట్లు గుర్తు చేసారు. మన హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించడం హిందూ సాంప్రదాయమని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి మహేశ్వర్రావు, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ పార్టీ నాయకులు రవిందర్రావు, కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, పడిగెల రవిందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News