Thursday, April 3, 2025

రాష్ట్రస్థాయి చెస్​ పోటీలకు అల్ఫోర్స్​ స్టూడెంట్స్​

నేటి సాక్షి, కరీంనగర్​: ఇటీవల కాలంలో కరీంనగర్ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో జీనియస్ చెస్ అకాడమి వారు నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో అల్ఫోర్స్​ విద్యార్థులు సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్​–11 బాలికల విభాగంలో ఆర్​ సుచరిత తృతీయస్థానం, అండర్​–9 బాలికల విభాగంలో జీ ఆయాన్​ రెండో స్థానం, అండర్​–9 బాలుర విభాగంలో ఎస్​ వేదాంశ్​ మూడో స్థానం, అండర్​–11 బాలుర విభాగంలో ఎం లికిత్​ మొదటి స్థానం, అండర్​–11 బాలికల విభాగంలో ఎస్​ సరాహర్షిని రెండో స్థానం, సాయి ప్రణవి 6వ స్థానం, అండర్​–12 బాలికల విభాగంలో అద్వేతయ రెండో స్థానం సాధించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను అల్ఫోర్స్​ అధినేత అభినందించారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వీఎన్​ఆర్​ మాట్లాడుతూ చెస్ విశ్వ క్రీడ అని, మేధోసంపత్తిని పెంచే క్రీడ అని, ఈ ఆటతో వివిధ పోటీల్లో విజయాలను చాలా సులువుగా సాధించవ్చని పేర్కొన్నారు. ప్రాథమిక దశల్లో విద్యార్థులకు వివిధ రకాల క్రీడల గురించి అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడకు ప్రత్యేకత ఉందని, ప్రత్యేకంగా విద్యార్థులకు పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు తగిన ఆలోచనలు అందజేస్తాయని చెప్పారు. విజేతలందరూ అద్భుతమైన విజయాలను నమోదు చేసి, తెలంగాణకే వన్నె తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News