
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించిన 1986 -88 బ్యాచ్ కు సంభందించిన MPC, BiPC విధ్యార్థులు కలిసి మైత్రి వెల్పేర్ అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల అట్టి బ్యాచ్ కు సంభందించిన వేల్పుల రత్నం కళాశాలను సందర్శించారు. ఈ క్రమంలో కళాశాలలో శితిలావస్థలోవున్న R.O వాటర్ ను గమనించి, వారియొక్క అధ్యక్షులతో చర్చించి అట్టి R.O ప్లాంట్ పునరుద్దరణకుగాను కాలసిన మొత్తాన్ని మిగతా సభ్యులతో కలిసి గురువారం రోజున కళాశాలకు వచ్చి 25000/- లను చెక్కు రూపేణా కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు కి అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ వి అంజనేయరావు మాట్లాడుతూ మీ యొక్క ఆర్ధిక సహాయం వల్ల కళాశాల విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందజేసినవారుగా, ముందు తరాలకు ఆదర్శవంతంగా ఉంటారు అని కొనియాడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మైత్రి వేల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి. సురేందర్ రెడ్డి, కార్యదర్శి జి. రవీందర్, బండ.శ్రీనివాస్, గోస్కుల శ్రీనివాస్, వేల్పుల రత్నం, మిగతా సభ్యులు పాల్గొన్నారు. వీరందరికీ కళాశాల అధ్యాపక సెక్రటరీ జి. తులసిదాస్, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.





