16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2008-09 పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు గురువారం రాముల గుట్ట వద్ద ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పూర్వ విద్యార్థులు కేక్ కట్ చేసి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటాపాటలతో సరదాగా గడిపారు. చిన్ననాటి చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు.16 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. నాడు చదువు చెప్పిన గురువులను సైతం పూర్వవిద్యార్థులు గుర్తు చేసుకున్నారు.






