నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 2004-05 సంవత్సరంలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక చోట కలిసి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిర పడిన వారు ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని చిన్ననాటి గత స్మృతులను, మధురానుభూతులను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదివిన తమకు విద్యతో పాటుగా సంస్కారం కూడ నేర్పించిందని అన్నారు. మిత్రులందరిని కలవడంతో తిరిగి బాల్యంలోకి వెళ్లినట్లు అనిపిస్తుందని, ఆనాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసి మనస్సుకు హాయి నింపడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి డి గోవింద రావు, అకాడమిక్ ఇన్చార్జి పూదరి సత్యనారాయణ, జిల్లా సహా కార్యదర్శి సూరం లక్ష్మీనారాయణ, పాఠశాల కార్యదర్శి దాసరి రాములు, పాఠశాల ప్రధాన ఆచార్యులు కట్ట శిరీష, కోశాధికారి డి సారయ్య, పూర్వ ఆచార్యులు సారంగపాణి, వై సత్యనారాయణ, పద్మావతి, రామకోటేశ్వరి, శారద, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.




