Wednesday, March 11, 2026

30 ఎళ్ళ తర్వాత ఏకమైన పూర్వ విద్యార్థులు…

  • ఉపాధ్యాయులతో పంచుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు
  • ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం.

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల):
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని 30 ఏళ్ళ తర్వాత ఏకమైన పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. వివరాల్లోకి వెళీతే కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాంతం ఆకట్టుకుంది. 1994-95 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు పాఠశాల స్థాయిలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. బాల్య మిత్రులతో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మూడు దశాబ్దాల తర్వాత అందరూ ఒక్కచోట కలవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనంతరం నాటి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా నాడు విద్యా బుద్దులు నెర్పిన గురువులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదివిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ప్రతి ఓక్కరు దేశాబివృద్దికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి హన్మకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రోఫేసర్ డాక్టర్ రాంభాస్కర్, కమలాపూర్ మండల రిటైర్డ్ ఎమ్ఈవో సుఖదేవ్, రిటైర్డ్ ఉపాద్యాయులు ఎడ్వర్డ్, సత్యనారాయణ, నర్సింహరెడ్డి, నారాయణ, రాజమౌళీ, డేవిడ్ లు 120 మందికి పైగా పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళ నిర్వహాణకు కృషిచేసిన శ్రీనివాస్, రాంబాబు, శివకుమార్, చంద్రశేఖర్లను పలువురు అబినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News