- అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
- ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
జూలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడుతూ చిన్నచూపు తో అంబేద్కర్ ని అవమానించే విధంగా ప్రోత్సహించారని ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా అంబేద్కర్ మండల అధ్యక్షుడు మామిడిపల్లి చంద్రశేఖర్ జిల్లా సెక్రెటరీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును హేళనగా మాట్లాడడం అంటే భారతదేశాన్ని హేళనగా మాట్లాడడమేనని, అమిత్ షా కళ్ళు అధికార గర్వంతో నెత్తికెక్కాయని విమర్శించారు. అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్చూచి అంబేద్కర్ పేరు అనేది ఈ దేశంలో ఈ క్వాలిటీ ప్రిన్సిపుల్ అని ఈ దేశంలో 85 శాతం మంది ప్రజల ఫ్యాషన్ అంబేద్కర్ పేరని తెలిపారు అమీత్ షా కు అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి శాంతి భద్రతల కు విఘాతం కలిగించే విధంగా సమాజంలో అలజడి సృష్టించాలని కుట్రలో భాగమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అమీషాపై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి కాంతయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు నేరువాట్ల ఆనంద్, ఇరుగురాల తిరుపతి, సిపిల్లి అంజయ్య, నేరువాట్ల మహేందర్, మానుమండ్ల వేణు, సిపెల్లి అంజయ్య, ఓల్లాజీ శ్రీనివాస్, మోదుపల్లి గంగయ్య, ముమ్మాడి రవి, సంకెళ్ల లక్ష్మణ్ ,మానుమండ్ల భూమయ్య ,ఎదుల్ల అంజయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు ఎదుల్ల మల్లేశం, మానుమండ్ల దుర్గయ్య ,చీకట్ల అంజయ్య, మొగురం మల్లేశం, ఇరుగురాల ప్రభాకర్, మోదుపల్లి బుచ్చయ్య, పాఠకుల చంద్రయ్య, చిదురి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.