నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
రామచంద్రాపురం మండలం రాయల చెరువు వద్ద వెలసిన శ్రీ శక్తి పీఠాన్ని ప్రముఖ అగరుబత్తి అంబికా దర్బార్ బత్తి ఉత్పాదకులు అంబికా కృష్ణ శుక్రవారం సందర్శించారు. వీరికి
పీఠం మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ సాదర స్వాగతం పలికారు, ఆస్థాన పండితులు రమేష్ శర్మ పీఠం విశిష్టత దేవతల గురించి తెలియజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి, శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠ ప్రతినిధులు, అంబికా అగర్బత్తి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు





