- ఈ దేశ పౌరులకు అతను క్షమాపణ చెప్పాలి.
- అమిత్ షా ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..
- తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్
నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్రంలో ఒక బాధ్యత గల పదవిలో ఉండి అంబేద్కర్ పై మీరు మాట్లాడిన మాటలు యావత్తు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అంబేద్కర్ పై అదేవిధంగా రాజ్యాంగంపై మీకు మీ పార్టీకి ఉన్న కుట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా, దేశ సమానత్వ స్ఫూర్తికి ప్రతీక. దేశ ప్రజలు ఎప్పటికీ ఆయన సేవలను గౌరవంతో స్మరించుకుంటారు. అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ, సబ్బండ వర్గాలను అవమానించే విధంగా ఉన్నాయి. వెంటనే అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయనను హోం మంత్రి పదవి నుండి భర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేత అంబేడ్కర్ గురించి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు భారత ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. ఇది మానవ సమానత్వానికి, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉంది. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని జాతికి క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేశారు.