నేటి సాక్షి వీణవంక:
వీణవంక మండలం, బొంతుపల్లి గ్రామానికి చెందిన జున్నూతుల కౌసల్య స్మారకార్థం వారి 5 వ వర్దంతిని పురస్కరించుకొని వారి భర్త జున్నూతుల నారాయణరెడ్డి, వారి కుమారుడు జున్నూతుల రాఘవరెడ్డి (SPGO) ప్రధానమంత్రి సురక్ష అధికారి, పోతిరెడ్డిపల్లి మరియు బేతిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ మరియు సభ్యులు నూనె కుమార్ లు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణరెడ్డి, PMSPG ప్రధానమంత్రి ముఖ్య భద్రత అధికారి రాఘవరెడ్డి కి అభినందనలు తెలుపుతూ విద్యార్థిని, విద్యార్థులు టీవీలకు, సెల్ ఫోన్ లకు ఆకర్షితులు కాకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని తెలియజేసినారు. ఈ సందర్భంగా రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శి ముద్ధసాని శ్రీనివాస్, సభ్యులు నూనె కుమార్, పోతిరెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయురాలు నివేదిత, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సునీత, చంద్రశేఖర్, శశిధర్, శ్రీధర్, శ్రీనివాస్, లక్ష్మీనర్సయ్య, రమేష్, బేతిగల్ ప్రధానోపాధ్యాయులు కిషన్ రెడ్డి, ఉపాధ్యాయులు అంజయ్య, రాజిరెడ్డి, వీరస్వామి, గంగరాజు, వెంకటేశ్వర్లు, మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.





