- జిల్లా కలెక్టర్ కు అంబేద్కర్ సేన వినతి
నేటి సాక్షి, మందమర్రి:– మున్సిపాలిటిలో 2020, 2021 సంవత్సరంలో మూడు కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని అంబేద్కర్ సేన నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమీషనర్ పైన అనేక అభ్యంతరాలు ఉన్నాయని, 3 కోట్ల మున్సిపల్ నిధులు, ప్రభుత్వ నిధులకు సంబంధించి ఖర్చు పెట్టిన వాటికి ఎలాంటి లెక్కలు చూపించకుండా ఎటువంటి రికార్డ్స్ నిర్వహించలేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అవినీతిని సహించేది లేదని అవకతవకల పై ఆర్డిఓని విచారణ అధికారిగా నియమించి 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.




