నేటిసాక్షి (కె. గంగాధర్ ) పెగడపల్లి : పెగడపల్లి మండలంలోని, బతికేపల్లి గ్రామ శివారులో పెద్దగుట్ట వద్ద ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు ప్రారంభించిన తర్వాత బతికే పల్లి పెద్దగుట్ట వద్ద కాలువ తవ్వుతుండగా అక్కడ దావుల జమున, మల్యాల శ్యామల అనే వారికి ఉర్దూ భాషలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి సుమారుగా 20 వెండి నాణాలు బయటపడినాయి. వెంటనే అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి పెగడపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జమున మరియు పోలీసు కానిస్టేబుల్ సంపత్ బతికేపల్లి గ్రామంలోని పెద్దగుట్ట వద్దకు చేరుకొని ఆర్ ఐ జమున సమక్షంలో పంచనామ నిర్వహించి అట్టి నాణాలు స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ వారికి అప్పగించడం జరిగిందని తెలియజేయడం జరిగింది.



