నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : సాక్షాత్తు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి స్నానం ఆచరించి నామాలు ధరించిన నామాల కాలువ గట్టు పైన ఇటీవల లభించిన అతి పురాతన విగ్రహాన్ని సోమవారం మధ్యాహ్నం శుభ సమయంలో నడవలూరు అర్చకులు కృష్ణమూర్తి స్వామి పునః ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు నామాల కాలవలో స్నానం ఆచరించి నామాలు ధరించిన అనంతరం గోవిందా! గోవిందా! అంటూ గోవిందా గోవింద నామ స్మరణం పలికారు భక్తి శ్రద్ధలతో పూజించి విగ్రహ ప్రతిష్ట చేసారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి స్వామి మాట్లాడుతూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడి తిరుమలకు వెళ్ళచ్చు ఈ యొక్క యోగుల పర్వతం కొండపై ఉన్న సిద్ధపరుచులు యోగుల తపసకు మిర్చి వారికే అభయమిచ్చిన అనంతరం యొక్క కాలువలో స్నానం ఆచరించి నామాలు ధరించారన్నారు. స్వామివారు నామాలు ధరించిన కారణంగా ఈ యొక్క కాలువకు నామాల కాలువగా పేరుగాంచిన స్వామివారు నామాలు ధరించిన అనంతరం ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రాజుల కాలంలో ఈ యొక్క స్వామి వారిపై దాడి జరిగినప్పుడు ఈ యొక్క స్వామివారిని ధ్వంసం చేశారన్నారు. అనంతరం పాదాలపై భాగం గత 20 సంవత్సరాలకు మునుపు ఇదే కాలువ పక్కన బయటపడగా ఆ యొక్క విగ్రహాన్ని నడవలూరులో గ్రామంలో ఉన్న మారేడు చెట్టు కింద ఉంచామన్నారు. ఈ సంవత్సరంలో జరిగిన రథసప్తమికి ముందు మూడు రోజులకు ముందు ఓ రైతు ఈ కాలువ గత పైన ట్రాక్టర్ తో దున్నుతున్నంగా ఈ యొక్క పాదాలు బయటపడ్డాయి అనంతరం ఈ పాదాలను పై భాగాన ఉన్న స్వామి వారికి జత చేయడంతో రెండు సరిపోయాయన్నారు. స్వామివారు ఎక్కడ దొరికారు అక్కడే ప్రతించాలని పలువురు సూచనల మేరకు ఈరోజు 12:00 పైన శుభలగ్నం యందు భక్తి శ్రద్ధలతో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవ చూపి టిటిడి వారు నామాల కాలవను అధీనంలో ఒక తీసుకొని ఇక్కడ ఆలయమున నిర్మించాలని కోరారు.





