- దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రణవ్.
- కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు.
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ ప్రాంతంలోని దేవాలయల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆంజనేయ స్వామి తనకు ఎంతో ఇష్టమైన దైవమని, నూతన సంవత్సరంలో తొలి వేడుకగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని కలిగిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు. శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలో గల హనుమాన్ దేవాలయంలో ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, నాయకులు ఘనస్వాగతం పలికిన అనంతరం కమిటీ చేత ఆలయ ఈవో సుధాకర్ చైర్మన్ గా కొలిపాక శంకర్, కమిటీ డైరెక్టర్లగా పున్నం చందర్, ప్రతాప నాగరాజు, బుసారపు శంకర్, మాచర్ల నరేష్, ఎర్ర మధులత, గాలిబ్ రాజేందర్ చే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రధాన ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, వేములవాడ ఆలయంలాగానే ఇళ్లందకుంట ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని త్వరలోనే వాటికి కూడా కమిటీ నియామకం జరుగుతుందని అన్నారు. కొన్నేళ్లుగా పాలకవర్గం లేక ఇబ్బంది పడ్డ హనుమాన్ దేవాలయ పాలకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొలువుదీరిందని, ఈ దేవాలయానికి సంబంధించి కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

