- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1389 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న, భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. సోమవారం వివాహ వార్షికోత్సవం సందర్భంగా బొందిళ్ళ నరేష్ లక్ష్మి దంపతులు, తోట దేవరాజు బాలలక్ష్మి దంపతులు, మెటుపల్లి వాస్తవ్యులు నంబి రాజేంద్ర శర్మ అరుణ దంపతులు, సోమవారం సందర్భంగా అన్నదానం చేయాలన్న సంకల్పంతో జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు, శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, ప్రతాప నటరాజు తదితరులు పాల్గొన్నారు.





