- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1370 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, రాజన్న ఆలయం, భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు.
బుధవారం అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు అనీషా, వీరి కుమారులు శ్రీహర్ష, సాయికృష్ణ గార్లు ఉన్నారని నిత్యాన్నదాన కార్యక్రమానికి సహకారం అందించా లనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 9246939388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, ప్రతాప నటరాజు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.





