నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1397 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. మంగళవారం అన్నదాతలుగా వారణాసి, శృంగేరి వాస్తవ్యులు మల్లాది వెంకట పూర్ణచంద్ర శాస్త్రి, నక్క నర్సవ్వ కుటుంబ సభ్యులు, జోగాపూర్ వాస్తవ్యులు బోరుగాయ మంజుల తిరుపతి దంపతులు జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, చల్లా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.





