- 21 సంవత్సరాలుగా శివ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే
- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారదా రెడ్డి దంపతులు

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : శ్రీశైల క్షేత్రం ఉత్తర ద్వార సన్నిధి ఉమామహేశ్వర సన్నిధిలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత 21 సంవత్సరాలుగా శివమాల ధారణ చేసి పాదయాత్ర చేసే స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి.ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే దంపతులు ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.క్షీరాభిషేకం, జలాభిషేకం, పుష్ప అభిషేకాలు నిర్వహించారు. అన్నప్రసాదాన్ని తీసుకువచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు దంపతులిద్దరికీ వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని దంపతులకు ఇద్దరు స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్రం, మహిమాన్వితమైనదని, ఆలయంలోని శివయ్యను అభిషేకిస్తే అనుకున్న కోరికలను నెరవేరుతాయని ఆది నుంచి ప్రతీది ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శివరాత్రి ముందు ఈ క్షేత్రం భక్తులతో కిటికీటలాడుతుందని, ఇక్కడ గత 21 సంవత్సరాలుగా వచ్చిపోయే శివ భక్తులకు అన్నదాన వితరణ చేస్తున్నందుకు తనకు ఎంతో సంతృప్తిగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.





