- సిపిఐ ఎంఎల్ మద్దతు
నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : ఏపీ ఎండిసీ పబ్లిక్ స్కూల్ సబ్ స్టాప్, తొలగించిన యాజమాన్యానికి నిరసనగా, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట స్కూల్ గేటు వద్ద, గత నెల రోజులు పైగా, ధర్నాలు, రిలే దీక్షలు చేస్తున్న, ప్రిన్సిపల్ ఎంప్లాయ్ గా, ఏపీఎండిసి, ఎండి గాని, సిపిఓ గాని స్పందించకపోవడం, అన్యాయమని సిపిఐ ఎంఎల్( లిబరేషన) జిల్లా నాయకులు, సిగి చెన్నయ్య ఆరోపించారు. సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి న్యాయమైన కోర్కెలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి నిర్వాసితులుగా పాఠశాలలో పనిచేస్తున్న వారిని కొత్త కాంట్రాక్టర్, ఉషోదయ, ఎడ్యుకేషన్, సొసైటీ కాంట్రాక్టర్, అక్రమ పద్ధతిలో అగ్రిమెంట్ తెచ్చుకొని మూడు నెలలు పని పని చేయించుకొని జీతం అడిగితే ఎటువంటి నోటీసు లేకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గం అన్నారు. తక్షణం వారిని డ్యూటీ లోకి తీసుకోవాలని, వారి మూడు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జయసింహ, హరి, తదితరులు పాల్గొన్నారు.





