- జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ లో భాగంగా 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు సివిల్ సర్వీసెస్ (ప్రభుత్వ ఉద్యోగులు), ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన వారు ఈ నెల 23, 24 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొని ఎంపిక కావలసి ఉంటుందని తెలిపారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్ (పురుషులు, మహిళలు), క్యారమ్ (పురుషులు, మహిళలు), హాకీ (పురుషులు, మహిళలు), పవర్ లిఫ్టింగ్ (పురుషులు, మహిళలు), స్విమ్మింగ్ (పురుషులు, మహిళలు), టేబుల్ టెన్నిస్, వాలీబాల్ (పురుషులు, మహిళలు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, మహిళలు), బెస్ట్ ఫిజిక్, రెజ్లింగ్ గ్రీకో రోమన్, ఖో-ఖో, యోగ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల సివిల్ సర్వీసెస్ (ప్రభుత్వ ఉద్యోగులు), ఉద్యోగులు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఇతర వివరాలకు 9963539234 నంబర్ లో సంప్రదించచ్చని, ఆసక్తి గల సివిల్ సర్వీసెస్ ఉద్యగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.




