నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
కళా రవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ కరీంనగర్ ఫోకా ఆర్ట్స్ అకాడమీ సంయుక్త నిర్వహణలో 15 గంటల చిరుతల భజన వరల్డ్ రికార్డు కొరకు దరఖాస్తుల ఆహ్వానం పలికింది. ప్రాచీన కళా సౌరభమైన చిరుతల భజన కళారూపానికి పూర్వ వైభవాన్ని ప్రాచుర్యాన్ని ప్రోత్సాహాన్ని కలిగించి మన ప్రాచీన కళారూపం యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను నేటి తరానికి పరిచయం చేస్తూ యువతరానికి స్ఫూర్తివంతంగా భావితరాలకు ఈ కళారూపాన్ని ప్రమోట్ చేయడానికి ఎంతోమంది యువతి యువకులు ఉత్సాహవంతులైనటువంటి కళాకారులు ఈ కళారూపాన్ని నేర్చుకోవడానికి వారిలో స్ఫూర్తిని నింపడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చిరుతల భజన కళాకారుల నుండి 33 జిల్లాల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది మీ దరఖాస్తులను ఈనెల 15వ తారీకు వరకు ఈ క్రింది చిరునామాకు పంపాలని, నిర్వహణ బాధ్యులు జి కృపాదానం విష్ణు దాస్ గోపాల్ రావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డాక్టర్. విష్ణుదాస్ గోపాల్ రావు. ఇంటర్నేషనల్ ఆర్టీస్ట్ 9440239793.





