- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ కులవృత్తులకు సంబంధించి పీఎం విశ్వకర్మ కింద ఎంపికై శిక్షణ తీసుకున్న లబ్ధిదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చిన సింక్రోస్ సర్వ్ ఏజెన్సీకి కలెక్టర్ అభినందనలు తెలిపారు. శిక్షణ తీసుకున్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో, పెండింగ్ లో ఉన్న పీఎం విశ్వకర్మ అప్లికేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.ధ్రువపత్రాలు అందుకున్న వారిలో 37 మంది కుమ్మరి చేతి వృత్తుల వారు, 33 మంది శిల్పి శిక్షణ పొందిన వారు, మరికొందరు ఇతర చేతివృత్తుల్లో శిక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎమ్ఈ ఏడి శివరాం ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ను శాలువాతో సన్మానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఎం ఎస్ ఎం ఈ ఎడి శివరాం ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం జ్యోతి, బిజీ సంక్షేమ అధికారి ఇందిరా, పరిశ్రమల శాఖ అధికారి నాగేష్, ఎల్ డి ఎం కౌశల్ కిషోర్ పాండే, అసిస్టెంట్ ఎల్ డి ఎం సాయి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






