- మండల అధ్యక్షులుగా వడ్లూరి పర్శరాములు
నేటి సాక్షి, బెజ్జంకి: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణంలో బాగంగా మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బెజ్జంకి మండల ఇంచార్జ్ చింతకింది పర్శరాములు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో నూతన కమిటీలు నియామకం పూర్తి చేసుకొని బెజ్జంకి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ మండల అధ్యక్షునిగా వడ్లూరి పర్శరాములు, ప్రధాన కార్యదర్శిగా మొదంపల్లి రాజు, ఉపాధ్యక్షులు చింతకింది ఎల్లయ్య, బెజ్జంకి శంకర్, సహాయ కార్యదర్శిగా కనగండ్ల సతీష్,ప్రచార కార్యదర్శిగా బట్టు ప్రసాద్, కార్యదర్సులుగా బోనగిరి ఆనందం,చిలుముల తిరన్, కొమ్ము లక్ష్మణ్,బోనగిరి ప్రభాకర్,గౌరవ సలహాదారులుగా తాడిచేట్టు భూమయ్య, కొంకటి జగన్,కార్యవర్గ సభ్యులుగా రామంచ మల్లేశం, కొంకటి రమేష్,మాతంగి రవి, జనగాం రాజు, నల్లగొండ శేఖర్, కల్లేపల్లి సంపత్, కనగండ్ల శంకర్, లను నియామకం చేసుకొని సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి నియామక పత్రం అందుకోవడం జరిగింది. నూతనంగా నియామకం అయిన అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు మాట్లాడుతూ నా నియామకం కు కృషి చేసిన అన్ని గ్రామాల సభ్యులకు, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చిన జాతి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జ్ చింతకింది పర్శరాములు, సీనియర్ నాయకులు మంకాళి బాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి మొదంపల్లి రాజు, గూడెం గ్రామ ప్రధాన కార్యదర్శి, మంకాళి బాబు తదితరులు పాల్గొన్నారు.

