నేటి సాక్షి, కరీంనగర్: ఆరోగ్యశ్రీ సృష్టికర్త, అభాగ్యుల ఆరోగ్య ప్రదాత మాజీ సీఎం వైఎస్సార్ అని మానకొండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా పదవులు అలంకరించి, ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి ఏపీ సీఎంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చేయూత అందించారని చెప్పారు. ముఖ్యమంత్రిగా మొదటి సంతకంతోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా నిలిచిపోయారని అన్నారు. గొప్ప మానవతావాదిగా అనారోగ్యలకు, అనాథలకు ఆపదలో ఉన్న వారందరికోసం ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాన్ని సృష్టించి, ఆరోగ్య ప్రదాతగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా వారిని మరోసారి స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించినట్టు చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వైఎస్ చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నగరంలోని పద్మనగర్‌లో భవిత వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్ ,చర్ల పద్మ, సమద్ నవాబ్, అహ్మద్ అలీ, పడిశెట్టి భూమయ్య, వెన్న రాజ మల్లయ్య, బొబ్బిలి విక్టర్, కాము రెడ్డి రాంరెడ్డి, ముస్తాక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య నాగుల సతీష్, వంగల విద్యాసాగర్, కల్వల రామచందర్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, దీకొండ శేఖర్, నూనె గోపాల్ రెడ్డి, రామిడి రాజిరెడ్డి, దన్ను సింగ్, షబానా మహమ్మద్, వెన్నం రజిత, హస్తపురం రమేష్, నెల్లి నరేష్, హస్తపురం తిరుమల, హసీనా, దామోదర్ ,మాదాసు శ్రీనివాస్, బత్తిని చంద్రయ్య గౌడ్, ములకల కవితా యోనా, సిరిపురం నాగప్రసాద్, పర్వత మల్లేశం, గంగుల దిలీప్, కనకయ్య, మమత, చింతల కిషన్, జొన్నల రమేష్, లాయిక్, ఖలీమ్, సుంకరి గణపతి, ములుగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.