Tuesday, March 10, 2026

నకిలీ వైద్యుడి అరెస్టుతో జిల్లాలో అలజడి

నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్. రమేష్:
గురువారం రోజు కామారెడ్డి లో నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి డివిజనల్ అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన, ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరికతో కొంతమంది ఆర్ఎంపి వైద్యుల వద్ద ప్రాక్టీస్ నేర్చుకున్నడు. రవీందర్ తన పేరును రవీందర్ రెడ్డి గా మార్చుకుని, ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకుని, తనని తాను పిల్లల వైద్యుడిగా ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో రవీందర్ అనే నకిలీ వైద్యుడు, కామారెడ్డి జిల్లా తో పాటు, వివిధ ప్రాంతాలలో పిల్లల వైద్యుడిగా చెలమనీ అవుతూ, డబ్బులు సంపాదిస్తూ, మోసాలకు పాల్పడ్డట్లు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. రవీందర్ ఖానాపూర్ లోని, షణ్ముఖ ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికెట్లతో, ఒప్పందం కుదుర్చుకొని జనవరి ఆరవ తేదీన రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నాడని పోలీసు విచారణలో తెలిసింది. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ వారి ఫిర్యాదుతో, నకిలీ వైద్యుడి గుట్టురట్టఅయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, నకిలీ వైద్యున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తి నుండి నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, పలు వస్తువులను రికవరీ చేసినట్లు, కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ సిఐ చంద్రకాంత్ రెడ్డి, రూరల్ సిఐ రామన్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎస్సైలు శ్రీరామ్, రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News