నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఈ నెల 23 న ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 20 వ చిత్రకళా పోటీ నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ సాగంటి మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళా శక్తి” అనే అంశం తో (ఆన్లైన్ & ఆఫ్లైన్) నాలుగు విభాగాల్లో పోటీ ఉంటుందని, ప్రతి విభాగం లో మూడు బహుమతులు ఉంటాయని, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందించబడునని వివరాలకు 8143643337 లో సంప్రదించాలని కోరారు.





