నేటి సాక్షి, అన్నమయ్య ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లారాయచోటి నియోజకవర్గంకాటిమాయకుంట హరిజనవాడ అభినవ అంబేద్కర్, మహాజన నేత పద్మశ్రీ అవార్డు వేల గొంతులు-లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. MRPS రాయచోటి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుంటిమడుగు ఆనంద్ మాదిగ అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, కాటిమాయకుంట హరిజనవాడలో MRPS రాయచోటి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి కార్యకర్తలతో కలసి డప్పులు, పాటలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటిమడుగు ఆనంద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా మహాజన నేత మాన్యశ్రీ మంద మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్ కేంద్రంగా ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు, లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాయచోటి నియోజకవర్గంలోని 8 మండలాల నుండి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి విద్యార్థులు యువకులు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు పెద్దలందరూ కూడా చంకన డప్పు వేసుకొని ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ కేంద్రానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.





