Friday, March 13, 2026

మీ బిడ్డగా ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది..!

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ
  • శరవేగంగా.. మరిపెల్లి, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు
  • ఎరువుల గోధంను ప్రారంభించిన
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి : రైతన్నకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సనుగుల వారి ఆధ్వర్యంలో నిర్మించిన కార్యాలయ భవనంతో పాటు స్టోరేజ్ గదిని రామారావుపల్లి గ్రామంలో ఎరువుల గోధంను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. ఈ సంద్భంగా ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది మాట్లాడుతూ.. సనుగుల మారుమూల ప్రాంతం అయినప్పటికీ రైతులకు సేవ చేయాలని ఆనాడు రైతుల ప్రయోజనార్థం సొసైటీ ప్రారంభం చేసుకోవడం అభినందనీయమన్నారు. సహకార సంఘాలు రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గతంలో నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు నేడు వాణిజ్య బ్యాంకులతో పోటీపడి రుణాలు ఇచ్చే స్థాయికి, ఉన్నత విద్య సహాయ సహకారాలు అందిస్తూ,రైతులకు సేవలు అందిస్తూ వ్యాపార పరంగా కూడా ముందుకు పోతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతును రాజును చేయడానికి సహకర సంఘాలను బలపేతం చేశారని తెలిపారు.. రైతులకు ఉచిత కరెంటు ప్రారంభం చేసి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆనాడు వారు ప్రారంభం చేసిన కోనుగోలు కేంద్రాలలో నేటికీ నిర్విరామంగా కొనసాగుతున్నాయి అన్నారు. రైతులకు సాగు నీరు అందించడానికి ఎంతో కృషి చేశారని మల్యాల గ్రామంలో 1737 కొట్లా తో ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారని కొనియాడారు. ఆనాడు సీ హెచ్చ్ రాజేశ్వరరావు తన సత్య శోధన పుస్తకంలో రాస్తూ నా కంటె చిన్నవాడైన ఆది శ్రీనివాస్ మన ప్రాంతానికి నీటిని తీసుకురావడానికి కృషి చేశారని ఆయన అన్నారని గుర్తూ చేశారు. ఆనాడు వైఎస్ మరణించాక పోతే మన ప్రాంతంలో ప్రోజెక్ట్ లు పూర్తి అయ్యేవని అన్నారు. కానీ గత పది సంవత్సరాలుగా మన ప్రాంతంలోని ప్రాజెక్టులకు పడవు పడ్డాయని వాటిని నేడు మీ బిడ్డ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారని తెలిపారు.

2009 లోనే చందుర్తి, రుద్రంగి నాగారం చెరువు, జోగాపూర్ చెరువులను పూర్తి చేసుకున్నామని మళ్లీ ప్రజా ప్రభుత్వంలో మరిపెల్లి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే గా గెలిచిన వారు ఆ పదవిని హోదకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతంన్ని అభివృద్ధి చేయలేదన్నారు. రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి మన ప్రాంతంలో నూతన సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎర్ర చేరవు పటేల్ చెరవులను గోదావరి జలాలతో నింపే ప్రక్రియ కార్యక్రమం చేపట్టడంతో పాటు ఆశిరెడ్డిపల్లె కొత్త చెరవు కూడా నీటితో నింపడం జరుగుతుందన్నారు. మన ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నమన్నారు.

1995 లో జడ్పీటీసీ గా పోటీ చేసినప్పుడు మీ బిడ్డగా భావించి యావత్ రామరావుపల్లి, సనుగుల ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. రామరావుపల్లి నక్కపల్లి ,కిష్టంపేట రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రాంతంలో 1000 కోట్ల తో అభివృది పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వివిధ రూపాలలో 54 వేల కొట్లు రూపాయలు వెచ్చించిదన్నారు. ఈ నెల 26 నుండీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డుల్లో పేరు లేని వారు ఈ నెల 21 నుండీ 24 వరకు గ్రామ సభలో తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మన ప్రాంతంలో అదనంగా మరో 4696 ఇళ్లను మంజూరి చేయడం జరిగిందని పేర్కొన్నారు. జనవరి 16 నుంచి జనవరి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జనవరి 21 నుంచి జనవరి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాలను జనవరి 26 నుంచి అమలు చేయడం జరుగుతుందన్నారు.ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News