Thursday, March 26, 2026

హసన్ పర్తి యు పి ఎస్సి లో ఆశా డే కార్యక్రమం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హసన్ పర్తి యుపిఎస్సి లో ఆశా డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా హనుమకొండ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య పాల్గొనీ మాట్లాడుతూ జాతీయ కార్యక్రమాలైన ఎన్సీడీ, టీబీ, లెప్రసీ మరియు వ్యాధి నిరోధక టీకాల కార్య క్రమాలను 100% విజయవంతం చేయాలని దిశా దశ నిర్దేశం చేయడం జరిగింది. ఎన్ సి డి కార్యక్రమంలో 30 సంవత్సరముల పై బడిన వారిని 100% స్కానింగ్ చేయాలని అలాగే బిపి, షుగర్ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు తగిన ఫాలో అప్ సేవలు అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధుల పైన తగిన అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యు పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ భార్గవ్, కృతిక, సురేష్, పాల్గొన్నారు మరియు పి హెచ్ ఎన్ మేరీ హెల్త్ సూపర్వైజర్స్ లచ్చులు, రుతమ్మ, ఫార్మసిస్ట్ అజిత స్టాఫ్ నర్స్ విజయ కుమారి హెల్త్ అసిస్టెంట్స్ ఏ నేమ్ లు ఆశాలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News