నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
తనపై నమ్మకంతో అప్పగించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ బాధ్యతలను బాధ్యతగా నిర్వహిస్తూ, గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని చెల్పూర్ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు గన్ను అశోక్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు చెల్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గన్ను అశోక్ కుమార్ ను నియమిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లూరి కిరణ్ బుధవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గన్ను అశోక్ కుమార్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ సహకారంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి చెల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్, మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, పార్టీ పెద్దలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సమ్మెట సంపత్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల అరవింద్, నాయకులు శనిగరపు తరుణ్, బండ లక్ష్మారెడ్డి, కడిపికొండ దేవేందర్‌రెడ్డి, మ్యాకం సంపత్, సిగ లత, దేవరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





