Tuesday, March 17, 2026

నిరుపయోగంగా అశ్వాపురం బస్టాండ్

  • ఎండలో మగ్గుతున్న ప్రయాణికులు
  • పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్) : భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం బస్టాండ్‌ ఎందుకు వినియోగంలోకి తీసుకురావడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసమర్థత, నిర్లక్ష్యమా, మాకేందుకులే ఆలోచన ధోరణి కారణమా అని విమర్శిస్తున్నారు.రూ లక్షల ప్రజాధనంతో నిర్మించిన బస్టాండ్‌ నిరూపయోగంగా ఉందని, ప్రధాన రహదారిపై ఎండలోనే ఉండవలసి వస్తుందని అధికారులకు ప్రజా ప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం నుండి ప్రతిరోజు హనుమకొండ, విజయవాడ, ఖమ్మం, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు అనేక మంది ప్రయాణిస్తూ ఉంటారు. బస్టాండ్ లేక మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారన్నారు.నిరూపయోగంగా ఉన్న బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.బస్సుల కోసం ఎండలో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ఏర్పాటు చేయాలఅని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News