నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
చందుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వేములవాడ ఎస్పి శేషాద్రిని రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఏదైనా శాంతి భద్రతలకు సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో ఉన్న అధికారులకు తెలియజేయాలన్నారు.




