Saturday, March 28, 2026

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోండి

  • రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడం.. మీ లక్ష్యంగా పెట్టుకోండి
  • చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
  • చిత్తూరు జిల్లాలో పాడి ఉద్యాన రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువమందికి ఉపాధి కల్పించవచ్చు
  • గ్రామీణ ప్రాంతాలలో పాడి ఉద్యాన రంగాలలో ఉన్న వారికి రుణాల మంజూరుకు బ్యాంకర్లు కృషి చేయండి
  • జిల్లా కలెక్టర్ సుమిత్ర కుమార్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చిత్తూరు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. సోమవారం సాయంత్రం చిత్తూరు సంతపేట ఆర్ఆర్ గార్డెన్ నందు యూనియన్ బ్యాంక్ ఎం ఎస్ ఎం ఈ మెగా ఔట్ రీచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ,యూనియన్ బ్యాంక్ ఎండి & సీఈఓ మణి మేఖలై లు విచ్చేసారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ … చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎం ఎస్ ఎం ఈ ఔట్రీచ్ కార్యక్రమమునిర్వహిస్తున్నామని, ఇందుకు కారణమైన ఎండి & సీఈఓ కి ధన్యవాదములు తెలిపారు. ఇదివరకే జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ కి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించామని, అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పథకాలు ఉన్నాయో ప్రజలకు తెలిపి వాటిని పొందే విధంగా చర్యలు చేపట్టామని, జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచేందుకు ప్రతి మండలానికి ఒకరు చొప్పున 31 మంది కోఆర్డినేటర్ లని నియమించడం జరిగిందని, దీనివల్ల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎం ఎస్ ఎం ఈ పథకాలపై అవగాహన వస్తుందని డి ఐ సి, కె వి ఐ సి కి సంబంధించి అప్లికేషన్లు రావడం జరిగిందని, ఎం ఎస్ ఎం ఈ కి సంబంధించిజిల్లాలో బ్యాంకుల ద్వారా రుణాలు తక్కువగా అందుతున్నాయని దీనికి కారణం వారికి సివిల్ స్కోర్ లేకపోవడమేనని, సిబిల్ స్కోర్ తనిఖీ లేకుండా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎండి & సీఈఓని, ఎల్ డి ఎం లను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారు చేయడమేనని తెలిపారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, చాలావరకు ఉపాధి కొరకు పక్క రాష్ట్రాలైన చెన్నై బెంగళూరు కు వలస వెళ్లాల్సి వస్తుందని, ఎం ఎస్ ఎం ఈ లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారికి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఉపాధి ఏర్పరచుకోవడమే కాకుండా మరికొందరికి ఉపాధి అందించే విధంగా చేయవచ్చన్నారు,పాడి పరిశ్రమ, ఉద్యానవన రంగాలలో అవకాశాలు ఎక్కువగా కలవన్నారు. జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ శాఖలకు ఈ రుణాలు ఇవ్వడం ద్వారా జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఇలా ఎం ఎస్ ఏం ఈ ద్వారా నే కాకుండా ముద్ర, పీఎం విశ్వకర్మ యోజన రుణాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రుణాలు పొందడంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఇలా చేయడం వల్ల త్వరగా రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ… చిత్తూరు జిల్లాలో 20 లక్షల జనాభా కలదని,తెలంగాణ, గుజరాత్ మహారాష్ట్రలతో పోలిస్తే ప్రజల ఆదాయం తక్కువగా ఉన్నదని దీని పెంపుదలకు కృషి చేయాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ, ఉద్యాన శాఖల ద్వారా ఎక్కువ ఆదాయం లభిస్తుందని ఈ రంగాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ఎక్కువ అవకాశాలు కలవని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఈ రంగాలలో వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు సిబిల్ కోడ్ ద్వారా ఇబ్బందులు పడుతున్నారని ఈ అంశంపై బ్యాంకులు ఆలోచించి వారి ఆదాయ మార్గాలను పెంచేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎం ఎస్ ఎం ఈ లు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో ఆదాయ వనరులు పెరిగేందుకు ఎక్కువ అవకాశం కలవని ఆ దిశగా కృషి చేయాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఎండి మరియు సీఈవో మాట్లాడుతూ చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఎం ఎస్ ఎం ఈ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరులోముందున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ వారిని యూనియన్ బ్యాంక్ ఎండి, తన అధికారులు సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా ఎం ఎస్ ఎం ఈ లో భాగంగా ముద్రా రుణాలు, లక్ పత్ దీదీ, బ్యాంకు లింకేజి రుణాలు సంబంధించి మెగా చెక్కులను చిత్తూరు పార్లమెంటు సభ్యులు జిల్లా కలెక్టర్ ఎండి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News