- ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులే నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం!
- జిల్లా ఉన్నత అధికారులు స్పందించాలని ప్రజాసంఘాల వారు డిమాండ్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామపంచాయతీ శివారులోని అలంపూర్ చౌరస్తాలో ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు భూ అక్రమార్కులు రాజకీయ అండదండలతో భూదాన్ ,అసైన్డ్ భూములను కబ్జా చేసుకుని ఆక్రమించుకుంటున్నటువంటి సంఘటనలు ఉన్నాయి.అయితే ఇట్టి భూదాన్ ,అసైన్డ్ భూముల సమస్యలపై సంబంధిత రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే అలంపూర్ చౌరస్తాలో ఇటీవల కాలంలో ఓ జిల్లాస్థాయి ఉన్నత అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శితో కలిసి ఓ వెంచర్ ఏర్పాటుచేసిన వ్యక్తితో ఏకంగా మూడు లక్షలు డీల్ కుదుర్చుకొని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి విధితమే!.. అంటే అలంపూర్ చౌరస్తాలో కోట్లు విలువ చేసే అసైన్డ్ భూములకు,ఇతర వెంచర్లలు ఈమేరకు డిమాండ్ ఉందో ఎంత స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అన్న దానికి ఇదే నిదర్శనం. ఇదే కోవలోనే ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా కబ్జాకి గురయ్యాయని పలువురు ప్రజాసంఘాలవారు జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యంగా మారింది. రెవిన్యూ చట్టంలో సవరణలు చేసి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం .. మరి ప్రభుత్వ అసైన్డ్బుల్లను కాపాడడంలో విఫలమైందని పలువురు భావిస్తున్నారు. అల్లంపూర్ చౌరస్తా నుంచి రాయచూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో 256 /1 ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే నంబర్లలో ఓ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆ కోల్డ్ స్టోరేజ్ కు వెళ్లేందుకు ఎర్ర మట్టి ద్వారా ఏకంగా రహదారిని ఏర్పరచుకున్నారు.మరి అట్టి అసైన్డ్ భూమి పై ఇంతవరకే అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజాసంఘాలవారు మండిపడ్డారు ఇలా అల్లంపూర్ చౌరస్తాలో కోట్లు విలువ చేస్తే ప్రభుత్వ అసైన్ భూములు కబ్జా లో అవుతున్నాయని అట్టి భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.




