Saturday, March 21, 2026

సహాయ వ్యవసాయ సంచాలకుల క్షేత్ర పర్యటన

నేటి సాక్షీ, చెన్నూర్ టౌన్: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుబ్బరాంపల్లి, కత్తెరసాల గ్రామలలో చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి ప్రసాద్ క్షేత్ర పర్యటనలో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకం (NFSM) క్రింద వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చినటువంటి KNM-1638 రకం వరి విత్తనాల పంటను క్షేత్రస్థాయిలో సందర్శించి. ఈ సందర్శనలో భాగంగా వరి పంటలో పలు సూచనలు చేస్తు వరిలో కాండం తొలిచిపురుగు నివారణకు గాను క్లోరాంట్రనిలిప్రాల్ 0.3ml/లీటర్ నీటికి , ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు గాను కార్బన్ డిజమ్+ మాంకోజెబ్ 2గ్రాములు /లీటర్ నీటికి మరియు జింక్ లోప నివారణకు గాను జింక్ సల్ఫేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అని రైతులకు వివరించి, అలాగే ఆయిల్ పామ్ పంట సాగు గురించి యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువల గురించి అవగాహన కల్పిస్తు ఈ కార్యక్రమంలో చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి. ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కె. యామిని, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు వై. సాయి కృష్ణ, ఎం. రాజశేఖర్, ఎస్ సాగర్, రైతులు మదాసు కిష్టయ్య, బాల్నే రాజేష్. గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News