- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 22 : వనపర్తి మండలం రాజపేట లో గల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు ఐదు కోట్లు తో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అట్టి పనులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పరిశీలించడం జరిగింది. ఏటీసీ భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. పక్కనే ఉంటున్న ఐటిఐ విద్యార్థులతో అక్కడున్న వసతులను పరిశీలించడం జరిగింది. మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది.





